జై తెలంగాణ యాదయ్య.. 
(తెలంగాణ శ్రీనివాస్) విద్యార్థులు అసెంబ్లీ ముట్టడి తలపెట్టినప్పుడు ఓయూ విద్యార్థులను పోలీసులు  ఉస్మానియా యూనివర్సిటీలో అడుగడుగునా అడ్డుకున్నరు. ముట్టడిని ఫెయిల్  చేయడానికి సీమాంధ్ర మీడియా పోలీసులతో చేతులు కలిపింది. టీవీ9 కవరేజి  ముసుగులో పోలీసుల కోసం ఒక హెలికాప్టర్‌ను హైదరాబాద్‌లో తిప్పింది. ఎక్కడ  నుంచి విద్యార్థులు వస్తుదన్నది కనిపెట్టి పోలీసులకు సమాచారమందించింది. ఈ  పరిణామాలతో అనుమాన పడ్డ యాదయ్య ఓ పోలీసోడిని అసెంబ్లీ ముట్టడి సక్సెస్  అయితదా అన్నా అని అడిగిండు. ఆ ఆంధ్రా పోలీసోడు అసెంబ్లీ ముట్టడి ఫెయిల్  అయితదని చెప్పిండు. ఎట్లనన్నా ముట్టడిని సక్సెస్ చేయాలనుకున్నడు యాదయ్య.  ఓయూ మెయిన్‌గేట్ దగ్గర అందరూ చూస్తుండగా ఒంటిపై కిరోసిన్ పోసుకుని  నిప్పంటించుకున్నడు. ఒక్క పోలీస్‌కన్నా మంటలు అంటియ్యాలనుకుని భగభగమండే  మంటలతో జై తెలంగాణ అనుకుంటూ ఆంధ్రా పోలీసులపైకి  దునికిండు. అసెంబ్లీ  ముట్టడిని సక్సెస్ చేసి అమరుడయ్యిండు. అనాథగా పెరిగిన యాదయ్య తాను  సంపాదించే రూ.2000 లలో సగం అనాథ ఆశ్రమానికి ఇచ్చేవాడు. 22 సంవత్సరాల వయసులో  యాదయ్య ఎంత పరినతి సాధించాడు. ఆస్ఫూర్తి.. తెలంగాణ రావాలనే ఆతృత హాట్సాఫ్  టు యాదయ్య. కానీ ఆత్మార్పణ చేయకుండా నీ స్ఫూర్తిని నీ ఆవేశాన్ని నలుగురికి  పంచితే ఉద్యమం ఇంకింత ముందుకు పోయేది. యాదన్న.. నీకు వేలవేల దండాలన్నా..  తెలంగాణను చావకుండా సాధించాలె.
 
 
No comments:
Post a Comment