| నీతీజాతి లేని రాజకీయ నేతల వల్ల తెలంగాణ ఆగిపోతుంది. | 
| రాజకీయ  నాయకులను నమ్ముకుంటే నట్టేట్లో మునుగుతం. పదవుల కోసం కొందరు, పార్టీ మనుగడ  కోసం ఇంకొందరు, పైసల ఆశకు మరికొందరు రాజకీయ నాయకులు నానాగడ్డి  కరుస్తున్నారు. ఈ నీతీజాతి లేని రాజకీయ నాయకులతో ఇప్పట్లో తెలంగాణ  రాదనిపిస్తున్నది. అసలు ఇంకెప్పుడు తెలంగాణ రాదేమోననిపిస్తుంది. డిసెంబర్  31న గురువారం శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చింది. చిదంబరం జనవరి 6న 8  గుర్తింపుఉన్న పార్టీలను పిలిచి అభిప్రాయాలను సేకరించి అదేరోజున నివేదికను  బహిర్గతం చేస్తనని చెప్పారు.  కేంద్రంలో చీమచిటుక్కుమన్నా తెలుసుకునేంత  కెపాసిటీ ఉన్న సీమాంధ్ర నేతలు నివేదిక సమర్పించాక కూడా సైలెన్స్గా ఉన్నారు.  సమైక్యాంధ్ర కోసం పాటుపడే సీమాంధ్ర మీడియా కూడా కనీసం స్పందించలేదు.  తెలంగాణ విషయంలో అధిష్టానాన్ని ధిక్కరించి ప్రెస్మీట్లు పెట్టే లగడపాటి  జగడంపెట్టకుండా సైలెంట్గా ఉన్నడు. తెలంగాణ ఇవ్వరని వీళ్లకు ముందే  లీకయ్యిందా. సీమాంధ్ర నేతలు కూడా మీడియా ముందుకు రాలేదు. ఏ కొంచెం తేడా  వచ్చినా సీమాంధ్ర విద్యార్థులను రెచ్చగొట్టే సీమాంధ్ర  మీడియా వాళ్లను  శాంతపరిచింది. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలకు కూడా తెలంగాణ రాదని తెలిసి కేసులు ఎత్తివేయాలని నాటకమాడారు. తెలంగాణ రాకపోతే ప్రజలు తరిమికొడతరని తెలిసి తన్నులు తినకుండా ఉండేందుకే దీక్షల నాటకమాడారు. అసెంబ్లీ 3రోజులు స్తంభించినా స్పందించని ప్రభుత్వం కాంగ్రెస్ ఎంపీలను, ఎమ్మెల్యేలను కాపాడేందుకే కేసులను ఎత్తివేసింది. తెలంగాణ రాదని తెలిసినా.. ఇంతమంది బిడ్డలు ఆత్మార్పణ చేస్తున్నా తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ ప్రజల మనోభావాలతో ఆటలాడుకుంటున్నయి. పదవుల కోసం తెలంగాణ కాంగ్రెస్ నేతలు కొంచెం కూడా సిగ్గులేకుండా బతుకుతున్నరు. కోమటిరెడ్డిని తెలంగాణవాదులు అసహ్యించుకుంటున్నరు. జానారెడ్డి మంత్రి పదవి రాగానే తెలంగాణవాదాన్ని మరిచిపోయాడు. తెలంగాణవస్తే నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు కానీ తెలంగాణ కోసం పోరాడటం లేదు. మంత్రి శ్రీధర్బాబు ఆదినుంచి తెలంగాణకు వ్యతిరేకంగానే పనిచేస్తూ సీమాంధ్రనేతల మెప్పు పొందుతున్నడు. సారయ్య మంత్రిపదవిరాగానే జైతెలంగాణ మాని నై తెలంగాణ అంటున్నడు. సిగ్గులేకుండా సీమాంధ్ర నేతలు బతుకుతున్నారు. కాంగ్రెస్, టీడీపీ నేతలూ బతుకుతున్నారు. ఏం జీవితాలయా మీవి. తెలంగాణవాదుల భావోద్వేగాలను వాడుకుంటున్న రు. తెలంగాణ రాజకీయ పార్టీల నేతల కొడుకో, బిడ్డో నిజమైన తెలంగాణవాదై ఆత్మహత్య చేసుకున్నా ఆ శవంతో రాజకీయ లబ్ధిపొందేందుకే చూస్తారు తప్ప తెలంగాణకోసం నిస్వార్థంగా పోరాడరు మన తెలంగాణ నేతలు. ఛి ఏం నేతలు మీరు. కొంచెం కూడా జవాబుదారీతనం లేదా. ఇంకెన్నాళ్లు తెలంగాణవాదుల శవాలతో రాజకీయాలు చేస్తరు. మీవల్ల ఎంతమంది చావాలి.రాక్షసులన్నా అప్పుడప్పుడు మంచిపనులు చేశారు. మిమ్మల్ని రాక్షసులతో పోలిస్తే పాపం రాక్షసులు కూడా సిగ్గుపడుతరు. | 
Sunday, January 9, 2011
నీతీజాతి లేని రాజకీయ నేతల వల్ల తెలంగాణ ఆగిపోతుంది.
Subscribe to:
Post Comments (Atom)
 
 
No comments:
Post a Comment