తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు..
ఫ్రీజోన్ అంశంపై తేల్చుకోవడానికి నవంబర్ 29, 2009న ఆమరణ దీక్షకు దిగిన కేసిఆర్‌ను కేసీఆర్ దీక్ష చేపట్టిండు. కేసీఆర్ దీక్షను భంగం చేసేందుకు పోలీసులు పెద్ద కుట్రలు చేసిన్రు. ఉస్మానియా యూనివర్సిటీ యుద్ధభూమిగా మారింది. ఆమరణ దీక్షతో కేసీఆర్ ఆరోగ్యం క్షీణించింది. తెలంగాణ ఉద్యమసారథి పరిస్థితి చూసి ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఉద్యమంలో పోరాటం చేసిండు ఓ ఫిజియోథెరపీ విద్యార్థి. ఉద్యమంతో ప్రభుత్వం స్పందిస్తలేదని.. తెలంగాణ ప్రజలందరినీ ఉద్యమంలో పాల్గొనేలా చేయాలనుకున్నడు. తెలంగాణ వస్తేనే బీదబిక్కి బతుకుతరనుకున్నడు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తయనుకున్నడు. కేసీఆర్ దీక్షకు తను మలుపునివ్వాలనుకున్నడు. నవంబర్ 30న ఎల్బీనగర్ చౌరస్తాలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మార్పణకు చేయాలనుకున్నడు నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం పొడిచేడు గ్రామానికి చెందిన శ్రీకాంతాచారి. మంటలకు తాళలేక ఎవరైనా అమ్మో, అయ్యో అంటరు కానీ శ్రీకాంతాచారి జైతెలంగాణ జైజై తెలంగాణ అని నినదించిండు. ఆస్పత్రిలో మూడురోజుల పాటు ట్రీట్‌మెంట్ జరిగింది. శ్రీకాంతాచారి చావును ఆహ్వానించిండు. మలిదశ ఉద్యమంలో తొలిఅమరుడయిండు శ్రీకాంతాచారి. తెలంగాణవాదులు వెళ్లి ఎంతపని చేసినవు బిడ్డా.. అంటే ఇప్పుడు నేను మళ్ల బతికినా తెలంగాణ కోసమే చస్తా అని చెప్పిండు. అక్కడున్నోళ్లంతా కన్నీళ్లపర్యంతమయిన్రు. నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం ప్రతీ యువకుడు ఉద్యమించిండు.
No comments:
Post a Comment