Sunday, January 9, 2011

టీడీపీకి, సీమాంధ్ర మీడియాకు సిగ్గులేదు

టీడీపీకి, సీమాంధ్ర మీడియాకు సిగ్గులేదు..
చర్లపల్లి జైల్లో దీక్ష చేస్తున్న విద్యార్థులను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ స్టూడెంట్‌ జేఏసీ సోమవారం విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చింది. ఆదివారం రోజే టీఎస్‌ జాక్‌ పిలుపునివ్వడంతో తెలంగాణలో టీడీపీ ఖాళీ అయింది కాబట్టి బంద్‌ సక్సెస్‌ కాదని భావించిన ఆంధ్రబాబు కూడా సోమవారమే బంద్‌కు పిలుపునిచ్చిండు. తెలంగాణ స్టూడెంట్ జేఏసీ పిలుపు మేరకు స్పందించిన తెలంగాణ విద్యార్థులు, విద్యాసంస్థలు స్వచ్ఛంద బంద్‌ పాటించిన్రు. దీన్నే అదనుగా తీసుకున్న టీడీపీ సిగ్గులేకుండా తమ బందే విజయవంతమైందని ఢంకా బంజాయించుకున్నరు. టీడీపీ నేతలకంటే సిగ్గులేదు ప్రచారం చేసుకున్నరు. సీమాంధ్ర మీడియా కూడా సామాజికవర్గ అభిమానంతో తెలంగాణలో టీడీపీ పిలుపు మేరకు బంద్‌ సక్సెస్‌ అని ప్రచారం చేసినయి. బాబు సామాజికవర్గ ఛానళ్లన్నీ ఆరు ప్లేట్లు, 9 ప్లేట్లు వేసి మెదక్‌, వరంగల్‌, కరీంనగర్‌, నల్లగొండ అంటూ జిల్లాల పేర్లు వేసినయి. ఛి జీవితం.. తెలంగాణ స్టూడెంట్‌ జేఏసీ బంద్‌ వల్లే తెలంగాణలో విద్యాసంస్థలు బంద్‌ అయినయిని ఎవ్వరూ రాయలేదు. సిగ్గులేని ఛానళ్లు. రాజ్‌న్యూస్‌ ఒక్కటే నిజాలను ప్రసారం చేసింది. వాస్తవాన్ని బయటపెట్టింది. హాట్సాఫ్‌ టు రాజ్‌న్యూస్‌.    
 
బూటకపు బాబు మరో నాటకం
రాజకీయ నాయకుడికి ఊసరవెల్లికి పెద్ద తేడా లేదు. ఆ మాటకొస్తే రాజకీయ నేత కన్నా ఊసరవెల్లే నయం. ఊసరవెల్లులు ఇప్పుడు ఛి రాజకీయనాయకుడా అని మరో ఊసరవెల్లిని తిడుతున్నయి. వ్యవసాయం దండగ.. వ్యవసాయం మానేయండి.. హైటెక్‌ దిశవైపు పరుగుపెట్టండని గతంలో ఢంకా బజాయించి, విజన్‌ 20-20 అంటూ బాబు ప్రగల్భాలు పలికిండు. అలాంటి చంద్రబాబు రైతుల కోసం నిరాహార దీక్ష చేపట్టిండు. ఏంటి నమ్మరా.. నిజంగా నిజం.. బాబు రైతుల కోసం నిరాహార దీక్ష చేపట్టిండు. కలికాలంరా బాబు అనుకుంటున్నారా.. లేదు.. లేదు సీమాంధ్రులకు కాలం కలిసివచ్చేలా చేయడానికి బాబు ఆడుతున్న డూపునాటకం అని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నరు. చర్లపల్లి జైల్లో విద్యార్థులు నిరవధిక దీక్షకు దిగిన వెంటనే బాబు దీక్ష మొదలు పెట్టాడు. చంద్రబాబు తన దీక్షను హైలెట్‌ చేసుకోవడం కోసం ఇంగ్లీష్ (నేషనల్‌ మీడియా)ను ఆకర్షించడానికి సీపీఎం ప్రకాష్‌కారత్‌ను, సీపీఐ బర్దన్‌ను పిలుచుకున్నడని కాంగ్రెస్‌ నేతలు విమర్శిస్తున్నరు. బాబు డ్రామాకు తోడు స్టూడియో-ఎన్‌ దీక్ష మొదలుపెట్టిన కొన్ని గంటలకే క్షీణించిన చంద్రబాబు ఆరోగ్యం అని ఇచ్చిన్రు. ఓ బగ్‌ కూడా వేసిర్రు. వాళ్ల సామాజిక వర్గం మీడియా కూడా హల్‌చల్‌ చేసింది.
 

No comments: