Sunday, January 9, 2011

తెలంగాణా ఉద్యమ ప్రస్థానం 2001

తెలంగాణా ఉద్యమ ప్రస్థానం 2001
ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఉద్యమం 2001 ఏప్రిల్‌ 27 న అధికారికంగా తెలంగాణా రాష్ట్ర సమితి ని ఏర్పాటు చెయ్యడంతో ప్రారంభమయింది. అప్పటి నుండి, ఈ ఉద్యమం ఎలా పురోగమించిందో, అక్షర బద్ధం చేసే విధం ఇది. కేవలం ఏమి జరిగింది, ఎవరు చెప్పారు, ఏమి చెప్పారు వంటి వాస్తవాల నివేదిక ఇది. * ఏప్రిల్‌ 27: ఆంధ్ర ప్రదేశ్‌ శాసనసభ ఉపసభాపతి, కె చంద్రశేఖర రావు తన పదవికి, శాసనసభా సభ్యత్వానికి, తెలుగుదేశం పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసి, ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర స్థాపనకై ఉద్యమించాడు. ఇందుకు గాను తెలంగాణా రాష్ట్ర సమితి పేరిట ఒక రాజకీయ పార్టీని ప్రారంభించాడు. శాసనసభకు పూర్వపు సభాపతి - జి నారాయణ రావు కూడా ఆయనతో విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు. మే 17 న కరీంనగర్‌లో నిర్వహించే తెలంగాణా సింహగర్జన ద్వారా తమ బలప్రదర్శన చేస్తామని ఆయన ప్రకటించాడు. [మార్చు] మే మే 2: తెలంగాణా రాష్ట్రం కొరకు జరిపే ఉద్యమం శాస్త్రీయంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా జరుగుతుందని, ఇతర ప్రాంతాల ప్రజలు భయపడనవసరం లేదని చంద్రశేఖర రావు చెప్పాడు.
తెలంగాణా ఉద్యమ ప్రస్థానం 2002 
ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఉద్యమం 2001 ఏప్రిల్‌ 27 న అధికారికంగా తెలంగాణా రాష్ట్ర సమితి ని ఏర్పాటు చెయ్యడంతో ప్రారంభమయింది. అప్పటి నుండి, ఈ ఉద్యమం ఎలా పురోగమించిందో, అక్షర బద్ధం చేసే విధం ఇది. కేవలం ఏమి జరిగింది, ఎవరు చెప్పారు, ఏమి చెప్పారు వంటి వాస్తవాల నివేదిక ఇది. 

హైదరాబాదుపై పోలీసు చర్య

హైదరాబాదుపై పోలీసు చర్య
హైదరాబాదు సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేసే ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం చేపట్టినదే పోలీసు చర్య (Police Action). ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలోను, తెలంగాణా చరిత్రలోను ఇది ఒక ప్రముఖ సంఘటన. భారత్ కు స్వాతంత్ర్యం వచ్చేనాటికి దేశంలో ఉన్న సంస్థానాల్లో హైదరాబాదు అన్నిటిలోకీ పెద్దది,అత్యంత సంపన్నమైనది. స్వంత పతాకం, స్వంత ద్రవ్యం, నాణేలు, తపాలా వ్యవస్థ, రైల్వే వ్యవస్థ, స్వంత రేడియో కలిగిన సంస్థానం అది. 1947 ఆగష్టు లో భారత దేశానికి స్వాతంత్ర్యం రాగానే, హైదరాబాదు నిజాము, హైదరాబాదును స్వతంత్ర దేశంగా ప్రకటించుకొనే ప్రయత్నాలు చేసాడు. ఈ ప్రయత్నంలో ఐక్యరాజ్యసమితికి ఒక బృందాన్ని పంపించాడు కూడా. విషయ సూచిక [దాచు] * 1 భిన్నాభిప్రాయాలు * 2 చర్య * 3 అ(న)ల్ప విషయాలు * 4 బయటి లింకులు [మార్చు] భిన్నాభిప్రాయాలు హైదరాబాదుపై పోలీసు చర్య విషయమై కేంద్ర ప్రభుత్వంలో భిన్నాభిప్రాయాలుండేవి. అప్పటి గృహ మంత్రి సర్దార్ పటేల్ పోలీసు చర్యకై వత్తిడి చేయగా, ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, అప్పటి గవర్నర్ జనరల్ మౌంట్ బాటెన్, తరువాతి గవర్నర్ జనరల్ రాజాజీ దానికి వ్యతిరేకంగా నిలిచారు. హైదరాబాదుపై పోలీసు చర్య తీసుకుంటే, దాని వలన భారత్‌లో ముస్లిముల నుండి వ్యతిరేకత వస్తుందని, పాకిస్తాన్ భారత్ పై దండెత్తుతుందని ప్రధాని భావించాడు. మౌంట్ బాటెన్ కూడా ఈ ఆలోచనను సమర్ధించాడు. 1948 మే లోనే చేపట్టాలని ప్రతిపాదించిన పోలీసు చర్య మౌంట్ బాటెన్, నెహ్రూల వ్యతిరేకత కారణంగా వాయిదా పడింది. మౌంట్ బాటెన్ గవర్నర్ జనరల్ గా ఉన్నంత వరకూ అది సాధ్యపడలేదు. [మార్చు] చర్య రెండు సార్లు వాయిదా పడిన తరువాత తిరిగి 1948 సెప్టెంబర్ 13 న పోలీసు చర్య చేపట్టాలని గృహ మంత్రి పటేల్ ప్రతిపాదించాడు. దీనిని వాయిదా వెయ్యవలసినదిగా అభ్యర్ధిస్తూ నిజాము రాజాజీకి చివరి నిముషంలో లేఖ రాసాడు. ఈ లేఖకు సానుకూలంగా స్పందించి, గవర్నర్ జనరల్ రాజాజీ, ప్రధాని నెహ్రూ మళ్ళీ వాయిదా వెయ్యాలని ప్రతిపాదించారు. పటేల్ మాత్రం వెనక్కి తగ్గక అప్పటికే చర్య ప్రారంభం అయిందని ప్రకటించాడు. అప్పటి భారత సైన్యపు బ్రిటిషు జనరల్ లాబ్‌లాక్‌హార్ట్, తనకు స్నేహితుడైన ఎల్ ద్రూస్ నేతృత్వంలో హైదరాబాదు సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని, భారతీయ సైన్యాన్ని నెలల తరబడి నిలువరించగల సత్తా దానికి ఉందని సలహా ఇచ్చాడు. అయితే చర్య మొదలైన ఐదవ రోజుకే పూర్తయిపోయింది. సెప్టెంబర్ 13 న తెల్లవారుజామున 3:30 కి పోలీసు చర్య మొదలైంది. భారత సైన్యం, జనరల్ జె.ఎన్.చౌదరి నేతృత్వంలో హైదరాబాదును ముట్టడించింది. సెప్టెంబర్ 17 న నిజాము సైన్యం భారత్ కు లొంగిపోయింది. అధికారిక లొంగుబాటు పత్రంపై సెప్టెంబర్ 18 న సాయంత్రం 4:30 కి సంతకాలు చేసారు. పోలీసు చర్య తరువాత ప్రధాని నెహ్రూ హైదరాబాదు వచ్చినపుడు నిజాము విమానాశ్రయంలో స్వాగతం పలికాడు. కొద్ది రోజుల తరువాత పటేల్ వచ్చినపుడు ప్రోటోకోల్ ప్రకారం స్వాగతం పలకవలసి ఉండగా, నిజాము ముందు అందుకు సమ్మతించలేదు. పోలీసు చర్యకు మూలకారకుడు పటేల్ అని నిజాముకు కోపం. అయితే చివరికి విమానాశ్రయానికి వెళ్ళి పటేల్ కు స్వాగతం పలికాడు. అప్పుడు వారిమధ్య జరిగిన సంభాషణ ఇలా ఉంది. నిజాము: “పొరపాట్లు మానవసహజం” పటేల్: “నిజమే. పొరపాట్ల వెంటే, సంబంధిత పరిణామాలు కూడా ఉంటాయి” [మార్చు] అ(న)ల్ప విషయాలు పోలీసు చర్య తరువాత ముస్లిములపై దాడులు జరిగాయనీ, వారిని ఊచకోత కోసారనీ వార్తలు వచ్చాయి. దీని విచారణకై, మౌలానా అబుల్ కలాం ఆజాద్ పట్టుదలమీద ప్రధాని నెహ్రూ పండిట్ సుందర్‌లాల్, యూనస్ సలీం, అబ్దుల్ గఫార్ లతో ఒక త్రిసభ్య సంఘాన్ని నియమించాడు. ఆ సంఘం సమర్పించిన నివేదిక ఈనాటికీ వెలుగు చూడలేదు. చర్య చేపట్టింది భారత సైన్యమే అయినా, దీనిని పోలీసు చర్య అన్నారు, సైనిక చర్య అనలేదు. దీనికి కారణాలు ఇలా ఉన్నాయి: నిజాము అప్పటికే హైదరాబాదును స్వతంత్ర దేశంగా ప్రకటించుకునే ప్రక్రియలో భాగంగా పాకిస్తానుతో మంతనాలు నెరుపుతున్నాడు. బ్రిటను టోరీ పార్టీ నాయకులతో కూడా సంబంధాలుండేవి. ఐక్యరాజ్యసమితికి హైదరాబాదు విషయాన్ని అప్పటికే నివేదించి ఉన్నాడు. భారత ప్రభుత్వమేమో హైదరాబాదు దేశ అంతర్భాగమని వాదిస్తోంది. ఈ పరిస్థితుల్లో సైనిక చర్య చేపడితే స్వంత భూభాగంపైనే సైన్యాన్ని ఎందుకు ప్రయోగించవలసి వచ్చిందనే ప్రశ్న ఉద్భవిస్తుందని తలచి, ప్రభుత్వం దీనిని పోలీసు చర్య అని పిలిచింది.

ఆంధ్ర మహాసభ (తెలంగాణ)

ఆంధ్ర మహాసభ (తెలంగాణ)
ఆంధ్ర మహాసభ (Andhra Mahasabha) నిజాం పాలనకు వ్యతిరేకంగా తెలంగాణా ప్రాంతపు తెలుగువారు ప్రారంభించిన సంఘం. తెలుగు భాషకు, తెలుగు సంస్కృతికి జరుగుతున్న ఆన్యాయాన్ని సహించలేక తెలంగాణ ప్రజలు ఆంధ్రమహాసభను స్థాపించారు. 1920వ దశకము చివర్లో మాడపాటి హనుమంతరావు నేతృత్వములో తెలుగు ప్రజలు సంఘటితమై ఒక సంఘముగా ఏర్పడి 1930 నుండి 1945 వరకు 12 ఆంధ్ర మహాసభలు నిర్వహించారు. తెలంగాణా ప్రాంతములో ఆంధ్ర మహాసభ యొక్క కార్యకలాపాలు నిజాం వ్యతిరేకముగా ప్రజలలో చైతన్యము సృష్టించి తెలంగాణా సాయుధ పోరాటానికి దారితీసాయి. ఆంధ్రమహాసభను నడిపిన వ్యక్తులలో ముఖ్యులు: మాడపాటి హనుమంతరావు,‌ రావి నారాయణరెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, దాశరథి కృష్ణమాచార్య, పులిజాల వెంకటరంగారావు, అళ్ళంపల్లి వెంకటరామారావు, కాళోజీ నారాయణరావు, కొండా వెంకట రంగారెడ్డి, వట్టికోట ఆళ్వారుస్వామి, పొట్లపల్లి రామారావు, ఆరుట్ల రామచంద్రరెడ్డి, ఇంకా చాలా మంది వున్నారు. విషయ సూచిక [దాచు] * 1 నేపథ్యము o 1.1 ఆర్యసమాజ్ o 1.2 గ్రంథాలయోద్యమం * 2 ఆంధ్ర మహాసభ అవిర్భావము * 3 మహాసభలు * 4 మూలాలు [మార్చు] నేపథ్యము భారతదేశంలోని సంస్థానాలలో కెల్లా హైదరాబాదు సంస్థానం పెద్దది. జనాభా ఒక కోటి ఆరవై లక్షలు. సంస్థానం కింద తెలంగాణ, మరాఠ్వాడ (మహరాష్ట్ర), కర్ణాటకలలోని భాగాలు ఉండేవి. 88 శాతం హిందువులు. మిగిలిన వారిలో అధిక భాగం ముస్లింలు, క్రైస్తవులు. నిజాం పాలనలో మత స్వాతంత్ర్యం అంతంత మాత్రంగానే ఉండేది. ఒకసారి దసరా పండుగ, మొహరమ్ (పీర్ల పండుగ) ఒకేసారి వచ్చాయి. సర్కారు మాత్రం మొహర్రంని మాత్రమే అన్ని ప్రభుత్య కళాశాలలలో జరిపించింది. నవాబు యొక్క బ్రిటీషు ప్రభుత్వ రాజభక్తి వళ్ల క్రైస్తవుల పట్ల మాత్రం ప్రత్యేక శ్రద్ధ చూపించేవారు. [మార్చు] ఆర్యసమాజ్ [మార్చు] గ్రంథాలయోద్యమం [మార్చు] ఆంధ్ర మహాసభ అవిర్భావము 1922లో హైదరాబాదులోని వివేకవర్ధిని థియేటరులో ఒక హిందూ సాంఘీక సభ జరిగింది. ఆ సభలో ప్రసంగాలన్నీ ఉర్దూ, మరాఠీ భాషలలోనే జరిగాయి. ఒకే ఒక వక్త - ఒక ప్లీడరు, తెలుగులో మాట్లాడబోగా సభ్యులంతా గేలి చేసి, గోల చేసి ఆతనిని మాట్లాడనివ్వలేదు. ఆ రోజుల్లో హైదరరాబాదు నగరంలో మహారాష్ట్రుల సంఖ్య తెలుగువారి కంటే చాల తక్కువ. అయినా అన్ని రంగాలలోను తమ ఆధిక్యతను ప్రదర్శిస్తూ ఉండేవారు. తెలుగు భాషకు మర్యాద, మన్నన ఉండేవికావు. ఆనాటి దుస్థితిని గూర్చి మాడపాటి హనుమంతరావు తన ఆంధ్రమహాసభ చరిత్రలో వివరించాడు. ఆ సభలో తెలుగు భాషకు, తెలుగు వక్తకు జరిగిన అవమానాన్ని గమనించిన కొందరు యువకులు కలిసి, ఆంధ్రభాషకు, సంస్కృతికి నగరంలో సముచిత స్థానం కల్పించాలన్న ఆశయంతో "ఆంధ్రజన సంఘం"ను స్థాపించారు. నిజాం రాష్ట్రంలో ఆంధ్రోద్యమానికి అదే నాంది. ఆ తర్వాత రెండు సంవత్సరాలకు నిజాం రాష్ట్రంలోని అన్ని తెలుగు సంస్థలను కలిపి ఒక ఆంధ్రజన కేంద్ర సంఘాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం ఈ సంఘం సమావేశాలు జరుగుతూ ఉండేవి. ఆంధ్రభాష, ఆంధ్ర సంస్కృతి అభివృద్ధికి తీసుకొనవలసిన చర్యల గూర్చి, సాధక బాధకాలు గురించి చర్చించేవారు. నిజాం రాష్ట్రంలోని ఏ తెలుగు సంస్థ ఆయినా సరే, తమ ప్రతినిధిని ఈ కేంద్ర సంఘానికి పంపవచ్చును. ఈ కేంద్ర సంఘానికి మాడపాటి హనుమంతరావు కార్యదర్శిగా వుండేవాడు. రాష్ట్రంలోని తెలుగు సంస్థల అభివృద్ధికి కేంద్ర సంఘం ప్రచారకులను పంపించి తోడ్పడుతూ వుండేది. ఈ కాలంలో ఈ సంఘం "వెట్టిచాకిరి", "వర్తక సంఘం" అన్న రెండు ముఖ్యమైన కరపత్రాలను ప్రచురించింది. [మార్చు] మహాసభలు మొదటి ఆంధ్రమహాసభ ఆంధ్రజన కేంద్ర సంఘం ఆధ్వర్యాన తెలుగు భాష, సంస్కృతుల పునరుజ్జీవనం కోసం, ఫ్యూడల్ దురంతాలకు వ్యతిరేకంగానూ చెదురుమదురుగా సాగుతున్న ఉద్యమాలు వాగులన్నీ చేరిన మహానది అయినట్లుగా మహోద్యమ స్థాయికి చేరాయి. 1930లో జోగిపేటలో ప్రధమాంధ్ర మహాసభ జరిగింది. ఆ మహాసభకు రాష్ట్రంలోని తెలుగు ఉద్యమాలన్నీ వచ్చి కలిశాయి. రూపాయి రుసుము చెల్లించిన ప్రతివారు ఆ మహాసభకు ప్రతినిధే. అప్పటికి ఒక నిర్ధిష్టమైన నిబంధనావళి ఈ మహాసభకు లేదు. దానికి సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షత వహించాడు. ఈ మహాసభలో ఇతర సమస్యలెన్ని వున్నా, సాంఘిక సమస్యలే తీవ్రమైన చర్చకు వచ్చాయి. బాల్యవివాహాలు, వితంతు వివాహాల మీద మహాసభ తీర్మానాలు చేసింది. ఈ సభలో మరాఠీ నాయకుడైన వామన్ నాయక్ ప్రధాన పాత్ర వహించాడు. ఆనాటికింకా ప్రజల్లో తగు చైతన్యం రాలేదనడానికి ఆ సభలో జరిగిన ఒక సంఘటన చెపితే చాలును. భాగ్యరెడ్డి అనే హరిజన నాయకుడు మహాసభకు ప్రతినిధిగా వచ్చాడు. అతను ఒక సమస్యపైన మాట్లాడబోయే సరికి సవర్ణులైన వర్తకులు కొందరు ఆసమ్మతిగా సభ నుంచి వెళ్ళిపోయారు. ఏది ఏమైనా ఈ ప్రధమాంద్ర మహాసభలో ఛాందసులదే పైచేయి ఆయింది. రెండవ ఆంధ్రమహాసభ నిజాం రాష్ట్ర రెండవ ఆంధ్రమహాసభ దేవరకొండలో 1931లో జరిగింది. అప్పటికే గాంధీ ఇర్విన్ ఒడంబడిక కుదిరింది. ఈ సభకు బూర్గుల రామకృష్ణారావు అధ్యక్షుడు. ఈ మహాసభలో కూడా సాంఘిక సమస్యలే ప్రముఖ స్థానం వహించాయి. మొదటి మహాసభలో ప్రధానపాత్ర వహించిన వామన్ నాయక్‌కు ప్రత్యర్థిగా రెండవ సభలో మరో మరాఠీ నాయకుడు కేశవరావు కూడా వచ్చాడు. సాంఘిక సమస్యలపైన వీరిద్దరికీ మహాసభలో తీవ్రమైన వాగ్వాదాలు జరిగాయి. కేశవరావు సంస్కరణవాది. యువకుల కృషితో ఈ మహాసభలో ఛాంధసులు ఓడిపోయారు. చర్చలలో మరాఠీ నాయకులు ప్రధానపాత్ర వహించినప్పటికీ చర్చలన్నీ తెలుగులోనే జరిగాయి. తీర్మానాలు మాత్రం ప్రధమ మహాసభలాగే ఈ మహాసభలో కూడా ప్రభుత్వాన్ని ప్రార్థించి, ప్రాధేయపడే రీతిగానే వున్నాయి. మూడవ ఆంధ్రమహాసభ రెండవ ఆంధ్రమహాసభ జరిగిన తర్వాత ప్రభుత్వ దృష్టి పూర్తిగా యిటు పడింది. ఆంధ్రమహాసభల నిర్వహణకు అనుమతి దొరకడం కష్టమైంది. ఎట్టకేలకు అనుమతి సంపాదించేసరికి మూడేళ్ళు పట్టింది. అందుకనే తృతీయ ఆంధ్రమహాసభను 1934లో జరపవలసి వచ్చింది. ఇది ఖమ్మంలో జరిగింది. ఆనాడు ఖమ్మం, వరంగల్లు జిల్లాలో ఉండేది. ఖమ్మం ఆంధ్ర మహాసభకు పులిజాల వెంకటరంగారావు అధ్యక్షత వహించారు. ప్రతి ఆంధ్రమహాసభ సందర్భంలోనూ మహిళాసభ కూడా జరగడం రివాజు. ఈ మహాసభలో ప్రవేశపెట్టడానికి వీలులేదని ప్రభుత్వం నిషేధించిన తీర్మానాలను మహిళా మహాసభలో ప్రవేశపెట్టారు. నాల్గవ ఆంధ్రమహాసభ నాల్గవ ఆంధ్రమహాసభ 1935 డిసెంబరులో సిరిసిల్లలో జరిగింది. దీనికి మాడపాటి హనుమంతరావు అధ్యక్షుడు. వివిధ విషయాలపై అనేక తీర్మానాలు ఆమోదించాల్సిన మహాసభ గతానుగతంగానే నడిచింది. ఆంధ్రోద్యమానికి వ్యవస్థాపకుడు ఆయిన మాడపాటి హనుమంతురావు మహాసభకు, ఆయన సతీమణి మాణిక్యమ్మ మహిళా మహాసభకు ఆధ్యక్షత వహించటం ఈ మహాసభ ప్రత్యేకత. మారాఠీ నాయకుల ప్రాబల్యంతో ప్రారంభం ఆయిన ఆంధ్రమహాసభలో దేవరకొండ సభ నాటికే అందరూ తెలుగులోనే మాట్లాడటం మొదలు పెట్టేరు. ఆరోగ్యకరంగా సాగుతున్న ఈ పరిణామాలు సిరిసిల్ల మహాసభలో తీవ్రతరమయ్యాయి. ఆంధ్రమహాసభ వ్యవహరాలన్నీ తెలుగులోనే జరగాలనీ, తీర్మానాలు, ప్రసంగాలు అన్నీ తెలుగులోనే ఉండాలని భాషావాదులు మహాసభ నిబంధనావళిలో పెట్టేరు. నిజాం సంస్ధానంలో తెలుగు భాషకు, సంస్కృతికి జరుగుతున్న ఆన్యాయాన్ని ఎదుర్కొనడం కోసం ఉద్రిక్తులైన కొందరు యువకులు ఆలాంటి క్లాజును చేర్పించారు. అందుకని వారి సదుద్దేశాన్ని ఎవరూ శంకించవలసిన పనిలేదు. అయితే రావి నారాయణరెడ్డి ఈ క్లాజును సమర్థించలేదు. ఐదవ ఆంధ్రమహాసభ 1936లో షాద్ నగర్‌లో జరిగిన ఐదవ ఆంధ్రమహాసభకు కొండా వెంకటరంగారెడ్డి ఆధ్యక్షత వహించాడు. ఈ మహాసభలో చేసిన తీర్మానాల్లో చెప్పుకోదగ్గ విశేషాలేమీ లేవు. కానీ అన్ని సభలకు వచ్చినట్లే ఈ సభకు కూడా కన్నడ, మరాఠా నాయకులు వచ్చి మహాసభ వేదికనలంకరించారు. ఆయితే నాల్గవ మహాసభలో భాషావాదులు ప్రవేశపెట్టిన క్లాజు మూలంగా వారు నోరు మెదపటానికి కూడ వీలులేకపోయింది. చివరకు వారు తమ సందేశాన్ని కూడా ఇవ్వకుండా తిరిగి వెళ్ళవలసివచ్చింది. ఆరవ ఆంధ్రమహాసభ ఆరవ ఆంధ్రమహాసభ 1937లో నిజామాబాదులో జరిగింది. దీనికి మందుముల నరసింగరావు ఆధ్యక్షత వహించాడు. భాషావాదులు ప్రవేశపెట్టిన క్లాజు వలన ఎదురైన దుష్ఫలితాలు ఈ మహాసభలో మరీ స్పష్టంగా బయటపడ్డాయి అని రావి నారాయణరెడ్డి అన్నాడు. మరాఠా నాయకుడైన కాశీనాథరావు ముఖ్ పాల్కర్, మౌల్వి గులాం భషానీ, వీరిద్దరూ ఆహ్వాన సంఘం సభ్యులు. మహాసభ నియమావళి మేరకు వీరిద్దరూ కూడా విషయ నిర్ణయసభకు ఎన్నికైనారు. ఈ సభలో వీరు ఆంధ్రేతర భాషలో మాట్లాడ్డానికి ప్రయత్నించారు. అందుకు భాషావాదుల క్లాజు అడ్డం వచ్చింది. నియమావళిలోని 31వ క్లాజు ప్రకారం ఆంధ్రేతర భాషలో ఎవరూ ప్రసంగించడానికి వీల్లేదని నందగిరి వెంకటరావు నాయకత్వాన భాషావాదులు అభ్యంతరం లేవదీశారు. దీనిపైన విషయ నిర్ణయసభలో తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. చివరికి రావి నారాయణరెడ్డి జోక్యంతో వారికి మాట్లాడే ఆవకాశం లభించింది. రాజకీయ హక్కులు ఏ కోశానాలేని ఆ రోజుల్లో మహాసభ నాయకులు తమకు రాజకీయాలతో సంబంధం లేదని చెప్పుకున్నా అప్పటికున్న చట్టాలకు లోబడి అతికష్టం మీద సభను నిర్వహిస్తూ వున్నా ఆసలు ఆంధ్రోద్యమం పుట్టుకలోనే గల రాజకీయ ప్రాముఖ్యాన్ని విస్మరించరాదు. ఆనాడు రాష్ట్రం నలుచెరగులా ఆంధకారం వ్యాపించి ఉంది. ఆలాంటి రోజుల్లో ఆంధ్రోద్యమం ఒక చిన్న దీపంలాగా వెలిగేది. ప్రజలకు మార్గం చూపించేది. ఏడవ ఆంధ్రమహాసభ సప్తమాంధ్ర మహాసభ హైదరాబాద్ జిల్లా (ప్రసుత రంగారెడ్డి జిల్లా) మల్కాపురంలో 1940లో జరిగింది. దీనికి మందుముల రామచంద్రరావు ఆధ్యక్షత వహించాడు. 1938 నుంచి స్టేట్ కాంగ్రెసు సత్యాగ్రహోద్యమం ఆరంభం అయింది. ఆంధ్ర మహాసభ కార్యకర్తలైన యువకులు ఈ సత్యాగ్రహోద్యమంలో పాల్గొన్నారు. అందువల్ల ఈ మహాసభ జరగటంలో ఆలస్యం జరిగింది. ఈ మధ్యకాలంలో ఆయ్యంగార్ కమిటీ ప్రభుత్వానికి తన నివేదిక సమర్పించింది. ఈ ఏడవ మహాసభలో చర్చకు వచ్చిన ప్రధాన తీర్మానం రాజ్యాంగ సంస్కరణలకు సంబంధించినది. మహాసభలో ఈ తీర్మానంమీద జరిగిన చర్చలను గురించి మాడపాటి హనుమంతరావు తన "ఆంధ్రోద్యమం" అన్న గ్రంథంలో ఈ విధంగా రాసాడు: "19 జూలై 1939 నాడు ప్రభుత్వంవారి వలన ప్రకటింపబడిన రాజ్యాంగ సంస్కరణములు తీవ్రముగా విమర్శించి ఖండింపబడుటయేగాక అట్టి నిరుపయోగములును, ఆభివృద్ధి నిరోధకములును అగు సంస్కరణములను బహిష్కరించవలయునను తీర్మానము ప్రతిపాదింపబడెను. దీనిలోని 'బహిష్కరించవలయును' అను భాగమును తొలగించవలయునని మితవాద నాయకులు ప్రవేశ పెట్టిరి. ఉభయ పక్షముల వాదములు సయుక్తికముగా జరిపిన మీదట తీర్మానమును ఓటుకు పెట్టగా సవరణ వీగిపోయి తీర్మానము అత్యంత బహుళ సంఖ్యామోదము పొంది అంగీకరింపబడెను". ఎనిమిదవ ఆంధ్రమహాసభ తొమ్మిదవ ఆంధ్రమహాసభ పదవ ఆంధ్రమహాసభ పదకొండొవ ఆంధ్రమహాసభ పదకొండవ ఆంధ్రమహాసభ 1944లో భువనగిరిలో జరిగింది. రావి నారాయణరెడ్డి ఆ సభకు అధ్యక్షత వహించాడు. ప్రసిద్ధ కవి సుద్దాల హనుమంతు స్వచ్ఛంద సేవకుడిగా ఈ సభల్లో పనిచేసాడు. భువనగిరి సభలో సైద్ధాంతిక విభేదాల వళ్ళ ఆంధ్ర మహాసభలో చీలిక యేర్పడింది. చీలిక వర్గమైన మితవాద సభ్యులు ఆంధ్ర మహాసభ నుండి నిష్క్రమించి వేరే సదస్సును జరుపుకున్నారు. ఈ మిగిలిన ప్రధాన వర్గమే తెలంగాణా సాయుధ పోరాటంలో నాయకత్వ పాత్ర పోషించింది.[1] పన్నెండవ ఆంధ్రమహాసభ పన్నెండవది చివరిదైన ఆంధ్రమహాసభ 1945లో ఖమ్మంలో జరిగింది. ఈ సభలో ప్రజల కోర్కెల సాధనకై చురుకుగా పోరాడాలని పిలిపునిచ్చారు.

మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమము

మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమము ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాలు కలిసి ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు కావడంలో కీలకమైనది పెద్దమనుషుల ఒప్పందం. 1956 జూలై 19 న కుదిరిన ఈ ఒప్పందంలో తెలంగాణా అభివృద్ధికి, తెలంగాణా సమానత్వ పరిరక్షణకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయి. ఆంధ్ర, హైదరాబాదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖ మంత్రులు, రెండు ప్రాంతాల కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు ఈ ఒప్పందంపై సంతకాలు చేసారు. ఈ ఒప్పందాన్ననుసరించి 1956 నవంబర్ 1 న ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడింది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. అయితే, ఈ ఒప్పందం అమలు విషయమై కొద్దికాలంలోనే తెలంగాణా ప్రజల్లో అసంతృప్తి బయలుదేరింది. ఒప్పందాన్ననుసరించి ఉప ముఖ్యమంత్రి పదవిని తెలంగాణా వాసికి ఇవ్వలేదు; అసలు ఆ పదవినే సృష్టించలేదు. అయితే 1959లో దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి కాగానే ఉప ముఖ్యమంత్రిగా తెలంగాణా ప్రాంతానికి చెందిన కొండా వెంకట రంగారెడ్డి (కె.వి.రంగారెడ్డి)ని నియమించాడు. అయితే మళ్ళీ 1962 నుండి 1969 వరకు ఉపముఖ్యమంత్రి పదవి లేదు. మళ్ళీ 1969లో తెలంగాణా ప్రాంతానికి చెందిన జె.వి.నర్సింగరావును ఉపముఖ్యమంత్రిగా నియమించారు. ఈ విధంగా రాజకీయ పదవుల విషయంలో తమకు అన్యాయం జరిగిందని తెలంగాణా వారు భావించారు. విషయ సూచిక [దాచు] * 1 సామాజిక నేపథ్యం * 2 రాజకీయ నేపథ్యం * 3 ఉద్యమ ప్రారంభం * 4 రెండవ దశ * 5 కోర్టు కేసులు * 6 తెలంగాణా ప్రజాసమితి * 7 ఉద్యమం వెనుకంజ * 8 ఇతర విశేషాలు * 9 వనరులు, మూలాలు * 10 బయటి లింకులు [మార్చు] సామాజిక నేపథ్యం ఆంధ్ర ప్రాంతం నుండి తరలి వచ్చిన ప్రజలు తెలంగాణా ప్రాంతంలో భూములు కొని, వ్యవసాయం చేసి అభివృద్ధి సాధించారు. ఇది తమ భూముల ఆక్రమణగా కొందరు తెలంగాణా ప్రజలు భావించారు. ప్రభుత్వ ఉద్యోగాలు, ఉపాధ్యాయుల నియామకాల్లో తమకు అన్యాయం జరిగిందనే భావన కూడా తెలంగాణా ప్రజల్లో కలిగింది. తెలంగాణా విద్యాసంస్థల్లో కూడా తమకు తగినన్ని సీట్లు రాలేదని విద్యార్ధుల్లో అసంతృప్తి నెలకొని ఉంది. [మార్చు] రాజకీయ నేపథ్యం 1967లో ముఖ్యమంత్రి అయిన తరువాత కాసు బ్రహ్మానంద రెడ్డి రాజకీయంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఆయనకు రాజకీయంగా సరిజోడీ అయిన మర్రి చెన్నారెడ్డి ఆయన మంత్రివర్గంలో మంత్రిగా ఉండేవాడు. అయితే చెన్నారెడ్డి కేంద్రంలో ఉక్కు,గనుల శాఖమంత్రిగా ఢిల్లీ వెళ్ళడంతో, ఆయన దైనందిన రాష్ట్ర రాజకీయాలకు దూరమయ్యాడు. అయితే, కొద్దిరోజుల్లోనే అనుకోని ఒక సంఘటన జరిగింది. అంతకు కొద్దికాలం క్రితం జరిగిన శాసనసభ ఎన్నికలలో చెన్నారెడ్డి అక్రమ పద్ధతులకు పాల్పడ్డాడనే ఆరోపణతో ఆయన చేతిలో ఓడిపోయిన వందేమాతరం రామచంద్రరావు వేసిన ఒక దావాలో చెన్నారెడ్డికి వ్యతిరేకంగా కోర్టు తీర్పు ఇచ్చింది. ఆయన ఎన్నికను రద్దు చేసి, ఆరేళ్ళపాటు ఎన్నికలలో పోటీ చెయ్యకుండా నిషేధించింది. చెన్నారెడ్డి వెంటనే కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి, పైకోర్టుకు వెళ్ళాడు. అక్కడా ఓడిపోయాడు. చివరికి సుప్రీంకోర్టు కూడా ఆయన అభ్యర్ధనను తోసిపుచ్చింది. [మార్చు] ఉద్యమ ప్రారంభం తెలంగాణా ఉద్యమం తెలంగాణా హక్కుల పరిరక్షణ ఉద్యమంగా మొదలైంది. తెలంగాణా రక్షణలను అమలు చెయ్యాలని కోరుతూ 1969 జనవరి 9న ఖమ్మం పట్టణంలో ఒక విద్యార్ధి నిరాహారదీక్ష ప్రారంభించాడు. ఆరోజు జరిగిన ఊరేగింపులో హింసాత్మక ఘటనలు జరిగాయి. మరుసటి రోజు ఉద్యమం నిజామాబాదుకు పాకింది. జనవరి 10 న హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం లో జరిగిన విద్యార్ధుల సమావేశంలో - తెలంగాణా రక్షణల అమలుకై జనవరి 15 నుండి సమ్మె చెయ్యాలని ప్రతిపాదించారు. అయితే, జనవరి 13 న అదే విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక సమావేశంలో విద్యార్ధులలోని ఒక వర్గం "తెలంగాణా విద్యార్ధుల కార్యాచరణ సమితి" గా ఏర్పడి, ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనే తమ ధ్యేయంగా ప్రకటించారు. అదే రోజున పురప్రముఖులు కొందరు "తెలంగాణా పరిరక్షణల కమిటీ" ని ఏర్పాటు చేసారు. జనవరి 18 న విద్యార్ధుల్లోని రెండు వర్గాలు (తెలంగాణా రక్షణల కోసం ఉద్యమించిన వారు, ప్రత్యేక తెలంగాణా కోరేవారు) వేరువేరుగా హైదరాబాదులో ఊరేగింపులు జరిపారు. ఈ రెండు ఊరేగింపులు ఆబిద్స్ లో ఎదురైనపుడు ఘర్షణ చెలరేగింది. పోలీసులు లాఠీఛార్జి చెయ్యవలసి వచ్చింది. అదేరోజు శాసనసభలోని ప్రతిపక్ష పార్టీలు తెలంగాణా రక్షణల అమలు కొరకు ప్రభుత్వాన్ని వత్తిడి చేసాయి. ఉద్యమకారుల కోరికలను చర్చించడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జనవరి 19 న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమావేశం కింది విధంగా ఒక ఒప్పందానికి వచ్చింది. * తెలంగాణాలో పనిచేస్తున్న ఆంధ్ర ఉద్యోగులను వెనక్కి పంపించాలి. * పెద్దమనుషుల ఒప్పందంలోని తెలంగాణా రక్షణలను అమలు చెయ్యాలి. అయితే ప్రత్యేక తెలంగాణా వాదులు ఈ ఒప్పందానికి సమ్మతించలేదు. ప్రత్యేక రాష్ట్రమే తమ ధ్యేయమని, అది నెరవేరేవరకు తమ ఉద్యమం కొనసాగుతుందని వారు ప్రకటించారు. అఖిలపక్ష కమిటీ ఒప్పందాన్ని అమలు చేస్తూ జనవరి 22న ప్రభుత్వం ఒక ప్రభుత్వ ఉత్తర్వును జారీ చేసింది. దీని ప్రకారం ఫిబ్రవరి 28 కల్లా స్థానికులు కాని ఉద్యోగులని వారి వారి స్థానాలకు వెనక్కి పంపివేస్తారు. తెలంగాణా రక్షణల అమలుకై మిగులు నిధుల అంచనాకు ఢిల్లీనుండి ఒక బృందం వస్తుంది. ఈ హామీలతో ఉద్యమానికి ఆద్యుడైన ఖమ్మం విద్యార్ధి తన దీక్షను విరమించాడు. దీనితో తెలంగాణా రక్షణల అమలు ఉద్యమం ఆగిపోయింది; ప్రత్యేక తెలంగాణా ఉద్యమం రెండవ దశలోకి ప్రవేశించింది. [మార్చు] రెండవ దశ మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమము యొక్క రెండవ దశను ప్రారంభించిన ఉద్యమకర్త కాళోజీ నారాయణరావు జనవరి 24 న సదాశివపేటలో జరిగిన పోలీసు కాల్పుల్లో గాయపడి మరుసటి రోజు హైదరాబాదు గాంధీ ఆసుపత్రిలో ఒక వ్యక్తి చనిపోయాడు. జనవరి 27న రంగాచార్యులు అనే ఒక ఆంధ్ర ప్రాంతపు ఉద్యోగిని నల్గొండ పట్టణంలో పెట్రోలు పోసి తగలబెట్టారు. ఆంధ్ర ప్రాంతపు ప్రజలలో భయాందోళనలు చెలరేగాయి. జనవరి 28న వరంగల్లులో కాళోజీ నారాయణరావు అధ్యక్షతన జరిగిన సదస్సులో ముఖ్యమంత్రి రాజీనామా చెయ్యాలని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని తీర్మానం చేసారు. క్రమేణా ఆందోళనలో హింసాత్మక చర్యలు పెరగసాగాయి. ఆంధ్రప్రాంతపు వారి ఆస్తులు తగలబెట్టడం, దోపిడిలు విస్తృతంగా జరిగాయి. ఆంధ్ర ప్రాంతంలో కూడా ప్రజలు సమ్మెలు చెయ్యసాగారు. తెలంగాణాలోని అనేక పట్టణాల్లోను, ఆంధ్రాలోని కొన్ని పట్టణాల్లోను సైన్యం కవాతు జరిపింది. ఉద్యమం శాంతియుతంగా జరపాలని కోరుతూ ఉద్యమ నాయకుడు మల్లికార్జున్ విద్యార్ధులకు విజ్ఞప్తి చేసాడు. అయినా హింస తగ్గలేదు. ఫిబ్రవరి 25న తాండూరు లో హింసాత్మక ఘటనలు జరిగినపుడు పోలీసు కాల్పుల్లో ఒక వ్యక్తి చనిపోయాడు. [మార్చు] కోర్టు కేసులు 1969,జనవరి 22 నాటి ప్రభుత్వ ఉత్తర్వు రాజ్యాంగంలోని ప్రాధమిక హక్కుల అధికరణాలకు విరుద్ధమని కొందరు ఉద్యోగులు హై కోర్టులో దావా వేసారు. అలాగే ఇదే ప్రభుత్వ ఉత్తర్వుకు వ్యతిరేకంగా జనవరి 31న ఐదుగురు తెలంగాణా ప్రాత ఉద్యోగినులు మరో దావా వేసారు. తమ భర్తలు ఆంధ్ర ప్రాతం వారని, ఈ ప్రభుత్వ ఉత్తర్వు వలన తమకు అన్యాయం జరుగుతుందని వారి వాదన. 1969,ఫిబ్రవరి 3: ఆ ప్రభుత్వ ఉత్తర్వు రాజ్యాంగ విరుద్ధమని హై కోర్టు తీర్పు నిచ్చింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం హై కోర్టులో మరో దావా వెయ్యగా, కోర్టు తమ ఫిబ్రవరి 3 నాటి తీర్పు అమలు పై స్టే ఇచ్చి, విచారణకు డివిజను బెంచిని ఆదేశించింది. ఫిబ్రవరి 18 న సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వ ఉత్తర్వుపై స్టే ఇచ్చి, ఉద్యోగుల బదిలీలను ఆపేసింది. 1969,ఫిబ్రవరి 20: హైకోర్టు మరో తీర్పు ఇస్తూ, ఇలా వ్యాఖ్యానించింది. * ముల్కీ నిబంధనలు రాజ్యాంగ బద్ధమే. * అయితే, బయటి వారిని వెనక్కి పంపకుండా, వారికొరకు అదనపు ఉద్యోగాలను (సూపర్ న్యూమరీ) సృష్టించాలి. అదనపు ఉద్యోగాల విషయమై తెలంగాణా ఉద్యోగ సంఘాలు నిరసన వ్యక్తం చెయ్యగా, ముల్కీ నిబంధనల పై ఆంధ్ర ప్రాంతంలో నిరసనగా సమ్మెలు జరిగాయి. 1969,మార్చి 7: ముల్కీ నిబంధనల అమలుపై మునుపు తనిచ్చిన స్టేను ధృవీకరిస్తూ, అదనపు పోస్టుల సృష్టించడాన్ని కూడా నిలిపివేసింది. 1969,మార్చి 29: సుప్రీంకోర్టు ఇలా తీర్పు ఇచ్చింది: * ముల్కీ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధం * తెలంగాణాలోని ఆంధ్ర ఉద్యోగులను వెనక్కి పంపే ప్రభుత్వ ఉత్తర్వు రద్దు [మార్చు] తెలంగాణా ప్రజాసమితి 1969 ఫిబ్రవరి 28 న యువకులు, మేధావి వర్గాలు కలిసి హైదరాబాదులో తెలంగాణా ప్రజాసమితి ని స్థాపించారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రమే దీని ధ్యేయం. మొదటి కార్యక్రమంగా మార్చి 3 న తెలంగాణా బందును జరిపింది. ఉద్యమాన్ని రాజకీయం చేసిన కాంగ్రేసు పార్టీ నాయకుడు మర్రి చెన్నారెడ్డి మార్చి 29 న ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఉద్యమం మరింత హింసాత్మకంగా మారింది. కొండా లక్ష్మణ్ బాపూజీ తన మంత్రి పదవికి రాజీనామా చేసి, తెలంగాణా కాంగ్రెసు సమితిని ఏర్పాటు చేసాడు. ఏప్రిల్ 21 న మర్రి చెన్నారెడ్డి కూడా ప్రత్యేక తెలంగాణాను సమర్ధిస్తూ ఉద్యమంలోకి రంగప్రవేశం చేసాడు. మే 1 - మేడే నాడు తెలంగాణా కోర్కెల దినంగా జరపాలని తెలంగాణా ప్రజా సమితి ఇచ్చిన పిలుపు హింసాత్మకంగా మారింది. మే 15 న కె.వి.రంగారెడ్డి కూడా తన పదవికి రాజీనామా చేసి, ఉద్యమ ప్రవేశం చేసాడు. అప్పటికి ఉద్యమాన్ని పూర్తిగా రాజకీయులు ఆక్రమించినట్లయింది. రాజకీయ నాయకుల జోక్యంతో ఉద్యమం నీరుగారుతుందని ఊహించిన కొందరు విద్యార్ధి నాయకులు పోటీ తెలంగాణా ప్రజా సమితిని ఏర్పాటు చేసారు. విద్యార్థి నాయకుడు శ్రీధరరెడ్డి దీనికి అధ్యక్షుడు. చెన్నారెడ్డి ప్రత్యర్ధులైన కొందరు రాజకీయ నాయకులు దీనికి మద్దతు పలికారు. వందేమాతరం రామచంద్రరావు, బద్రివిశాల్ పిట్టి వీరిలో ఉన్నారు. 1969 జూన్ మొదటి వారం ఉద్యమానికి అత్యంత హింసాత్మకమైన కాలం. సమ్మెలు, బందులు, దోపిడీలు, దాడులు, లాఠీచార్జిలు, పోలీసుకాల్పులు, కర్ఫ్యూలు మొదలైన వాటితో హైదరాబాదు అట్టుడికిపోయింది. విద్యార్ధులతోపాటు, కార్మికులు, ఉద్యోగులు కూడా సమ్మెలు చేసారు. జూన్ 10 నుండి తెలంగాణా ప్రాంత ఉద్యోగులు నిరవధిక సమ్మెను ప్రారంభించారు. 1969 జూన్ 24 న తెలంగాణా నాయకులు ప్రధానమంత్రి ఇందిరా గాంధీతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. జూన్ 25న హైదరాబాదులో సమ్మె జరిగింది. ఆ రాత్రి ఉద్యమ నాయకులను పోలీసులు అరెస్టు చేసి, రాజమండ్రికి తరలించారు. జూన్ 27 న ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి తన పదవికి రాజీనామాచేసాడు. కానీ ఆయన తన రాజీనామా లేఖను గవర్నరుకు కాక, కాంగ్రెసు అధ్యక్షుడు నిజలింగప్పకు పంపించాడు. దానిని ఆయన తిరస్కరించాడు. 1969 ఆగష్టు 18 న లోక్‌సభలో తెలంగాణా ప్రాంత ప్రతినిధులు జి.వెంకటస్వామి, జి.ఎస్.మేల్కోటేలు ప్రత్యేక తెలంగాణా గురించి తమ వాదనను వినిపించారు. ఆగష్టు 24న కొందరిని, 28న మరికొందరిని ప్రభుత్వం రాజమండ్రి జైలు నుండి విడుదల చేసింది. [మార్చు] ఉద్యమం వెనుకంజ 1969 సెప్టెంబర్ లో ఉద్యమం చల్లారడం మొదలైంది. 1969 సెప్టెంబర్ 22న కొండా లక్ష్మణ్ బాపూజీ "ముఖ్యమంత్రిని మారిస్తే ఉద్యమం వాయిదా పడవచ్చు" అని అన్నాడు. ఉద్యమ తిరోగమనానికి ఇది ఒక సూచిక. విద్యార్ధులు ఆందోళన మాని చదువులకు మళ్ళాలని తెలంగాణా ప్రజా సమితి సెప్టెంబర్ 23న ఒక ప్రకటనలో పిలుపునిచ్చింది. ఆ ప్రకటనపై చెన్నారెడ్డి, మల్లికార్జున్ సంతకం చేసారు. అప్పుడు హైదరాబాదులో ఉన్న రాష్ట్రపతి వి.వి.గిరికి చెన్నారెడ్డి స్వయంగా ఈ విషయం తెలిపాడు. దీనితో విద్యార్ధులలో అయోమయం నెలకొంది. నాయకత్వంపై విశ్వాసం కోల్పోయే పరిస్థితి తలెత్తింది. కేంద్ర నాయకత్వపు సాచివేత ధోరణి దృష్ట్యా, విద్యార్థులు చదువులు నష్టపోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని మల్లికార్జున్ సర్ది చెప్పే ప్రయత్నం చేసాడు. సెప్టెంబర్ 25 న తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడి హోదాలో కొండా లక్ష్మణ్ బాపూజీ కూడా రాష్ట్రపతిని కలిసి, తెలంగాణాను ఏర్పాటు చెయ్యాలని కోరాడు. విద్యార్థులను తరగతులకు వెళ్ళమని నాయకులు చేసిన ప్రకటన పలు విమర్శలకు గురైంది. నిరసన ప్రదర్శనలు జరిగాయి. 9 నెలలుగా చేసిన పోరాటం కొరగాకుండా పోతుందని విమర్శలు వచ్చాయి. తెలంగాణా ప్రజాసమితి ఉపాధ్యక్షుడు, వీరారెడ్డి కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. 1969 సెప్టెంబర్ 29 న కేంద్ర ప్రభుత్వం తెలంగాణా నాయకులను విడివిడిగా మాట్లాడడం మొదలుపెట్టింది. రాష్ట్ర నాయకత్వ మార్పు విషయంలో సహజంగానే భిన్నాభిప్రాయాలు బయటపడ్డాయి. అక్టోబర్ 10 నుండి తెలంగాణా అంతటా, చెన్నారెడ్డి పిలుపుమేరకు సత్యాగ్రహాలు మొదలయ్యాయి. ఇందులో 18 ఏళ్ళలోపు విద్యార్ధులు పాల్గొనరాదని నిబంధన పెట్టారు. ఆ రోజునుండి మల్లికార్జున్ నిరాహారదీక్ష మొదలు పెట్టాడు. నవంబర్ 3 వరకు కొనసాగిన ఈ దీక్ష పోలీసులు ఆయనను అరెస్టు చేసి, ఆసుపత్రిలో చేర్చడంతో ముగిసింది. 1969 నవంబర్ 26 చెన్నారెడ్డి ఒక ప్రకటన చేస్తూ విద్యార్థులు పరీక్షలలోను, గ్రామీణులు వ్యవసాయపు పనులలోను నిమగ్నమై ఉన్నందున, ఉద్యమంలో స్తబ్దత వచ్చిందని అన్నాడు. మరుసటిరోజు మరో ప్రకటనలో ప్రస్తుతానికి ఉద్యమాన్ని వాయిదా వేస్తున్నట్లూ, మళ్ళీ జనవరి 1 నుండి ప్రారంభిస్తున్నట్లు తెలియజేసాడు. ఈ ప్రకటనతో ఉద్యమం ముగిసినట్లైంది. డిసెంబర్ 6న తెలంగాణా ప్రజాసమితి నాయకులు టి.ఎన్.సదాలక్ష్మి, మరో ముగ్గురు ఒక సంయుక్త ప్రక టనలో చెన్నారెడ్డిని ప్రజాసమితి అధ్యక్ష పదవి నుండి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ప్రజాసమితిలోని మిగిలిన నాయకులెవరూ వీరికి మద్దతు నివ్వలేదు. ఈ విధంగా 1969 సెప్టెంబర్ నుండి, 1969 డిసెంబర్ వరకు రాజకీయనాయకుల ఎత్తులు పైయెత్తుల మధ్య, ఉద్యమం తీవ్రత తగ్గుతూ వచ్చి చివరికి పూర్తిగా చల్&#
రెండవ ప్రత్యేక తెలంగాణా ఉద్యమము
తెలంగాణా ప్రాంతంలోని 10 జిల్లాలతో ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే ఏకైక లక్ష్యంతో ప్రారంభమైంది తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం. రెండవ అనే పేరు అధికారికంగా ఈ ఉద్యమ నేతలు పెట్టుకున్నది కాదు. చరిత్రలో తెలంగాణా కొరకు దీనికంటే ముందు మరో ఉద్యమం జరిగింది కనుక ఈ రెంటిని విడిగా చూపడానికి రెండవ అనే పదం వాడవచ్చు. ఈ ఉద్యమానికి సారథి కె.చంద్రశేఖరరావు. తెలుగుదేశం పార్టీలో ఉంటూ మంత్రిగా, శాసనసభ ఉపాధ్యక్షుడిగా పనిచేసాడు. 2001 లో ఆ పార్టీ నుండి వైదొలగి, తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) పేరిట ఒక రాజకీయ పార్టీ ని ఏర్పాటు చేసాడు. తెలంగాణా రాష్ట్రాన్ని సాధించడమే ఈ పార్టీ యొక్క లక్ష్యం. చక్కటి కార్యక్రమాలతో సమర్ధవంతమైన నాయకత్వంతో పార్టీని అట్టడుగు స్థాయి నుండి నిర్మించుకు వచ్చాడు. ప్రత్యేక రాష్ట్రం పట్ల ప్రజల్లో సహజంగా ఉండే ఆసక్తి, ఈ అంశం యొక్క ఉద్వేగ భరిత చరిత్ర కూడా దీనికి దోహదపడ్డాయి. ఈ లోగా తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ లోని ప్రముఖ నేత ఆలె నరేంద్ర ఆ పార్టీ నుండి వైదొలగి, తెలంగాణ సాధన సమితి అనే సంస్థను ఏర్పాటు చేసి, ఉద్యమం ప్రారంభించాడు. కొద్ది కాలానికే - ఆగష్టు 2002 లో - తన సంస్థను తెరాస లో విలీనం చేసి, తెరాసలో తాను రెండో ప్రముఖ నాయకుడయ్యాడు. 2004 లో జరిగిన శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెసు పార్టీతో పొత్తు పెట్టుకుని, తెరాస మంచి విజయాలు సాధించింది . ఆ ఎన్నికలలో తెలుగుదేశం, భాజపా లను ఓడించి, కాంగ్రెసు (మరియు దాని నాయకత్వంలోని కూటమి) కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటినీ చేజిక్కించుకుంది. కేంద్ర, రాష్ట్రాలు రెండింటిలోనూ ప్రభుత్వంలో చేరింది. ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చెయ్యగలిగే స్థానాల్లో ఉండి, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడం తేలిక అని భావించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటిలోను చేరిన తెరాస, తప్పనిసరి పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం నుండి బయటకు రావలసి వచ్చింది. సార్వత్రిక ఎన్నికలలో కలిసి పోటీ చేసిన మిత్రులు కేవలం 16 నెలలలోపే విడిపోయి, బద్ధ శత్రువుల వలె తిట్టుకుంటూ పురపాలక సంఘ ఎన్నికలలో పరస్పరం పోటీ పడ్డారు. పురపాలక ఎన్నికలలో అతి తక్కువ స్థానాలు గెలిచిన తెరాసకు తీవ్రమైన ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణా వాదుల వాదనలు * పెద్దమనుషుల ఒప్పందాన్ని ఏనాడూ ఆంధ్రులు అమలు చేయలేదు. ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వటంలేదు. * కృష్ణా గోదావరి నదుల పరివాహక ప్రాంతం 80 శాతం మాదైతే 88 శాతం నీళ్ళు వాళ్ళవి. కరెంటు70 శాతం ఉత్పత్తి మాది. 80 శాతం పంట ఋణాలు వాళ్ళవి. మూడొంతుల ఉద్యోగాలు వాళ్ళవి. * శాంతియుతంగా అన్నదమ్ముల్లా విడిపోదాం. * తెలంగాణ వద్ద ఉన్న వనరులతో ఆంధ్ర ప్రాంతం ఇప్పటికే చాలా ప్రయోజనం పొందింది. * ప్రత్యేక తెలంగాణం.. స్వాభిమానానికి ప్రతీక. ప్రత్యేక తెలంగాణాపై యాభై ఏళ్లుగా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇది ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టింది. * రాజ్యాంగం ప్రకారం చూసినా రాష్ట్రాల ఏర్పాటు అనేది కేంద్ర పరిధిలోని అంశం. అసెంబ్లీలో తీర్మానం అవసరం లేదు. అది లేకుండానూ కేంద్రం ఆమోదించవచ్చు. * తమిళనాడుకే తెలుగుగంగ నీళ్లు ఇస్తున్నప్పుడు తెలంగాణా నుంచి ఆంధ్రకు నీళ్లు అందకుండా చేస్తారని అనుకోవడం సరికాదు. * భౌగోళిక, చారిత్రక కోణాల్లో ఎలా చూసినా హైదరాబాద్‌ తెలంగాణాలో అంతర్భాగమే. * విలీనం నాటికి తెలంగాణాయే పారిశ్రామికంగా ముందుండేది. గత యాభై ఏళ్లుగా తెలంగాణా చాలా త్యాగాలు చేసింది. ఆంధ్ర అభివృద్ధిలో ఎక్కువ భాగాన్ని ఆంధ్రలోని సంపన్నులు తీసుకున్నారు. తెలంగాణ వివక్షకు గురైంది. సింగరేణిలో, సచివాలయంలో అన్నిచోట్లా కోస్తావారే ముఖ్యమైన ఉద్యోగాల్లో ఉన్నారు. ఇది ఆర్థిక అసమానతలకు దారి తీసింది. * బడ్జెట్‌ కేటాయింపులోనూ ఆంధ్రాకే అగ్రస్థానం. సమైక్యాంధ్రుల వాదనలు * పూర్తిగా అభివృద్ధి చెందిన తెలంగాణా ఇప్పుడు విడగొడితే కోస్తా వనరులన్నీ అటే వెళ్తాయి. దీనివల్ల కోస్తా ప్రాంతంలోని రైతులకు కష్టాలు తప్పవు, * తెలంగాణా విడిపోతే ఆ ప్రాంత ప్రజలు కోస్తాంధ్రకు రావాల్సిన నీటిని అడ్డుకుంటారు, ఫలితంగా వ్యవసాయం, దాని అనుబంధ పరిశ్రమలు మూతపడి నిరుద్యోగం పెరుగుతుంది. * తెలంగాణా నుంచి కోస్తాంధ్రకు చెందిన ఉద్యోగులను తరిమివేస్తారు. కోస్తాంధ్రకు ఆదాయాలు కూడా తగ్గుతాయి. * తెలుగు మాట్లాడే ప్రజలు విశాలాంధ్ర కోసం అనేక దశాబ్దాలు పోరాడారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలనేవి జాతీయ ఉద్యమంలో ఒక భాగం. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో సహేతుకత ఉంది. * దేశంలో వెనకబడిన ప్రాంతమంటూ లేని రాష్ట్రమేదీ లేదు. తెలంగాణలో కూడా వెనకబడిన ప్రాంతాలు ఉండొచ్చు. కానీ అభివృద్ధి చెందిన ప్రాంతాలూ ఉన్నాయి. ఇలాంటి విభజన కొనసాగిస్తే, విభజన రేఖ ఎక్కడ గీయగలం. * ప్రత్యేకవాదం సమస్యకు పరిష్కారం కాబోదు. ఇది మరో అతిపెద్ద సమస్యకు ప్రారంభం అవుతుంది. ఇతర రాష్ట్రాలతో పాటు, ప్రత్యేకవాదం గురించి మాట్లాడుతున్న అదే ప్రాంతంలోనూ భవిష్యత్తులో ఈ సమస్య తలెత్తవచ్చు. * చిన్న రాష్ట్రాలు దేశ ఉనికికి ప్రమాదంగా మారుతాయి. * తెలుగు మాట్లాడే వారంతా కలిసి ఉంటేనే అభివృద్ధి సాధించవచ్చు. * ఐటీ కంపెనీలు ఇతర రాష్ట్రాలకు తరలిపోవడానికి సిద్ధమవుతున్నాయి. ప్రత్యేకాంధ్రుల వాదనలు * కోస్తాల్లోని వెనకబడిన ప్రాంతాలు తెలంగాణతో సమానంగా అభివృద్ధి చెందలేదు. * హైదరాబాద్‌పై కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన పట్టణాల అభివృద్ధిని గురించి ఎన్నడూ ఆలోచించలేరు. * రెండు లేదా మూడు తెలుగు రాష్ట్రాలు ఉంటే తప్పేంటి? దేశంలో చిన్న రాష్ట్రాలు అభివృద్ధి చెందటం లేదా? * 1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు రెండు ప్రాంతాల మధ్య భావ సమైక్యత లేదు. * తెలంగాణ ప్రజలంతా విడిపోవాలని కోరుకుంటున్నప్పుడు కాదు.. కలిసే ఉందామనడం సమంజసం కాదు. * ఆంధ్రులకు మరో ముఖ్య పట్టణం అవసరం ఉంది. ఆరోగ్య, విద్య, న్యాయ, వ్యాపార, సాంకేతికపరమైన అంశాలకు హైదరాబాద్‌ అందరికీ అందుబాటులో లేదు. * కోస్తా ఆంధ్రులకు సుదీర్ఘమైన 960 కి.మీ తీర ప్రాంతం ఉంది. అనేక నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. అయితే అవేవీ అక్కడి పేద ప్రజలకు ఉపయోగపడటం లేదు. * విశాఖపట్నాన్ని పారిశ్రామిక కేంద్రంగా, కర్నూలు ని న్యాయవ్యవస్థా కేంద్రంగా, తిరుపతిని సాంస్కృతిక కేంద్రంగా మలుచుకోవచ్చు. * భౌగోళికంగా విడిపోవడంవల్ల తెలుగు భాషకు నష్టం లేదు. వివిధ మాండలికాలు అభివృద్ధి చెందుతాయి. * తెలంగాణ ఇవ్వడంవల్ల తెలంగాణ వారికి ఎంత ప్రయోజనమో ఆంధ్రా వారికి అంతకు రెట్టింపు ప్రయోజనం.

టీడీపీకి, సీమాంధ్ర మీడియాకు సిగ్గులేదు

టీడీపీకి, సీమాంధ్ర మీడియాకు సిగ్గులేదు..
చర్లపల్లి జైల్లో దీక్ష చేస్తున్న విద్యార్థులను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ స్టూడెంట్‌ జేఏసీ సోమవారం విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చింది. ఆదివారం రోజే టీఎస్‌ జాక్‌ పిలుపునివ్వడంతో తెలంగాణలో టీడీపీ ఖాళీ అయింది కాబట్టి బంద్‌ సక్సెస్‌ కాదని భావించిన ఆంధ్రబాబు కూడా సోమవారమే బంద్‌కు పిలుపునిచ్చిండు. తెలంగాణ స్టూడెంట్ జేఏసీ పిలుపు మేరకు స్పందించిన తెలంగాణ విద్యార్థులు, విద్యాసంస్థలు స్వచ్ఛంద బంద్‌ పాటించిన్రు. దీన్నే అదనుగా తీసుకున్న టీడీపీ సిగ్గులేకుండా తమ బందే విజయవంతమైందని ఢంకా బంజాయించుకున్నరు. టీడీపీ నేతలకంటే సిగ్గులేదు ప్రచారం చేసుకున్నరు. సీమాంధ్ర మీడియా కూడా సామాజికవర్గ అభిమానంతో తెలంగాణలో టీడీపీ పిలుపు మేరకు బంద్‌ సక్సెస్‌ అని ప్రచారం చేసినయి. బాబు సామాజికవర్గ ఛానళ్లన్నీ ఆరు ప్లేట్లు, 9 ప్లేట్లు వేసి మెదక్‌, వరంగల్‌, కరీంనగర్‌, నల్లగొండ అంటూ జిల్లాల పేర్లు వేసినయి. ఛి జీవితం.. తెలంగాణ స్టూడెంట్‌ జేఏసీ బంద్‌ వల్లే తెలంగాణలో విద్యాసంస్థలు బంద్‌ అయినయిని ఎవ్వరూ రాయలేదు. సిగ్గులేని ఛానళ్లు. రాజ్‌న్యూస్‌ ఒక్కటే నిజాలను ప్రసారం చేసింది. వాస్తవాన్ని బయటపెట్టింది. హాట్సాఫ్‌ టు రాజ్‌న్యూస్‌.    
 
బూటకపు బాబు మరో నాటకం
రాజకీయ నాయకుడికి ఊసరవెల్లికి పెద్ద తేడా లేదు. ఆ మాటకొస్తే రాజకీయ నేత కన్నా ఊసరవెల్లే నయం. ఊసరవెల్లులు ఇప్పుడు ఛి రాజకీయనాయకుడా అని మరో ఊసరవెల్లిని తిడుతున్నయి. వ్యవసాయం దండగ.. వ్యవసాయం మానేయండి.. హైటెక్‌ దిశవైపు పరుగుపెట్టండని గతంలో ఢంకా బజాయించి, విజన్‌ 20-20 అంటూ బాబు ప్రగల్భాలు పలికిండు. అలాంటి చంద్రబాబు రైతుల కోసం నిరాహార దీక్ష చేపట్టిండు. ఏంటి నమ్మరా.. నిజంగా నిజం.. బాబు రైతుల కోసం నిరాహార దీక్ష చేపట్టిండు. కలికాలంరా బాబు అనుకుంటున్నారా.. లేదు.. లేదు సీమాంధ్రులకు కాలం కలిసివచ్చేలా చేయడానికి బాబు ఆడుతున్న డూపునాటకం అని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నరు. చర్లపల్లి జైల్లో విద్యార్థులు నిరవధిక దీక్షకు దిగిన వెంటనే బాబు దీక్ష మొదలు పెట్టాడు. చంద్రబాబు తన దీక్షను హైలెట్‌ చేసుకోవడం కోసం ఇంగ్లీష్ (నేషనల్‌ మీడియా)ను ఆకర్షించడానికి సీపీఎం ప్రకాష్‌కారత్‌ను, సీపీఐ బర్దన్‌ను పిలుచుకున్నడని కాంగ్రెస్‌ నేతలు విమర్శిస్తున్నరు. బాబు డ్రామాకు తోడు స్టూడియో-ఎన్‌ దీక్ష మొదలుపెట్టిన కొన్ని గంటలకే క్షీణించిన చంద్రబాబు ఆరోగ్యం అని ఇచ్చిన్రు. ఓ బగ్‌ కూడా వేసిర్రు. వాళ్ల సామాజిక వర్గం మీడియా కూడా హల్‌చల్‌ చేసింది.
 

తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు..

తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు..
ఫ్రీజోన్‌ అంశంపై తేల్చుకోవడానికి నవంబర్‌ 29, 2009న ఆమరణ దీక్షకు దిగిన కేసిఆర్‌ను కేసీఆర్‌ దీక్ష చేపట్టిండు. కేసీఆర్‌ దీక్షను భంగం చేసేందుకు పోలీసులు పెద్ద కుట్రలు చేసిన్రు. ఉస్మానియా యూనివర్సిటీ యుద్ధభూమిగా మారింది. ఆమరణ దీక్షతో కేసీఆర్‌ ఆరోగ్యం క్షీణించింది. తెలంగాణ ఉద్యమసారథి పరిస్థితి చూసి ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఉద్యమంలో పోరాటం చేసిండు ఓ ఫిజియోథెరపీ విద్యార్థి. ఉద్యమంతో ప్రభుత్వం స్పందిస్తలేదని.. తెలంగాణ ప్రజలందరినీ ఉద్యమంలో పాల్గొనేలా చేయాలనుకున్నడు. తెలంగాణ వస్తేనే బీదబిక్కి బతుకుతరనుకున్నడు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తయనుకున్నడు. కేసీఆర్‌ దీక్షకు తను మలుపునివ్వాలనుకున్నడు. నవంబర్‌ 30న ఎల్బీనగర్‌ చౌరస్తాలో ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మార్పణకు చేయాలనుకున్నడు నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం పొడిచేడు గ్రామానికి చెందిన శ్రీకాంతాచారి. మంటలకు తాళలేక ఎవరైనా అమ్మో, అయ్యో అంటరు కానీ శ్రీకాంతాచారి జైతెలంగాణ జైజై తెలంగాణ అని నినదించిండు. ఆస్పత్రిలో మూడురోజుల పాటు ట్రీట్‌మెంట్‌ జరిగింది. శ్రీకాంతాచారి చావును ఆహ్వానించిండు. మలిదశ ఉద్యమంలో తొలిఅమరుడయిండు శ్రీకాంతాచారి. తెలంగాణవాదులు వెళ్లి ఎంతపని చేసినవు బిడ్డా.. అంటే ఇప్పుడు నేను మళ్ల బతికినా తెలంగాణ కోసమే చస్తా అని చెప్పిండు. అక్కడున్నోళ్లంతా కన్నీళ్లపర్యంతమయిన్రు. నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం ప్రతీ యువకుడు ఉద్యమించిండు.