వీర తెలంగాణ పోరు బిడ్డలు-ఓరుగల్లు జర్నలిస్టులు
డ్యూటీ అంటే వాళ్లకు ప్రాణం. ఉద్యమమే వాళ్ల ఊపిరి. ఎవ్వనికీ ఊడిగం చెయ్యరు. తెలంగాణవాదాన్ని వదిలిపెట్టరు. ఉద్యమ ద్రోహులను ఉచ్చ పోయిస్తరు. ఉద్యమం జరుగుతున్న తీరుతెన్నులను ప్రాణాలకు తెగించి రిపోర్ట్ చేస్తరు. జర్నలిస్టుల మీద ఎవ్వడన్న పొరపాటున చెయ్యెస్తే వాడికి దేత్తడి. పోచమ్మ గుడే. మొన్న స్టేషన్ ఘనపూర్ లో రెండు చానళ్ల కెమెరామెన్లపై టీడీపీ గూండాలు దాడికి యత్నిస్తే చంద్రబాబు ప్రసంగాన్ని అడ్డుకున్నరు. బొల్లిబాబుకు చుక్కలు చూపించిన్రు. దెబ్బకు జడుసుకున్న, ఆంధ్రబాబు సభా వేదికపైనుంచి జర్నలిస్టులకు సారీ చెప్పిండు. పాలకుర్తిలో బాబు సభకు వచ్చినప్పుడు జనగామల విద్యార్థులు పోలీసులపై రాళ్లు వేసిన్రు. అదే టైంలో లైవ్ ఇస్తున్న డైనమిక్ జర్నలిస్టు తలకు బలమైన గాయం తగిలింది. ప్రాణగండం కొంచెంలో తప్పిపోయింది. అనేక సందర్బాల్లో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన మొనగాళ్లు. వీర తెలంగాణ పోరుబిడ్డలు, ధైర్యం, దమ్ము ఉన్న మగాళ్లు. విపత్కర పరిస్థితుల్లో పోలీసులకు రొమ్ముచూపి నిలబడ్డ నిఖార్సైన పులిబిడ్డలు. వరంగల్ జర్నలిస్టులు. నిజంగా ఆళ్లు మగాళ్లు రా బుజ్జి. వరంగల్ బ్లడ్ లక్షణమే అది. వరంగల్ అంటేనే తెగింపు. వరంగల్ అంటేనే రేషం పౌరుషం. నీతి నిజాయితీ దమ్ము. ఇక్కడి వాళ్ల పిడికిళ్లు ఎప్పుడూ బిగుసుకొనే ఉంటయి. పరకాల పౌరుషం, మానుకోట మగతనం, బైరాన్ పల్లి తెగింపు ఊరుకో ఉద్యమం. వాడకో సాహసం. ఓరుగల్లు గడ్డ, పోరాటాలకు అడ్డ. ఇక్కడి ప్రజల గుండెల్లో జై తెలంగాణ నినాదాలు ప్రతిధ్వనిస్తూనే ఉంటయి. వీళ్లు తెలంగాణ తల్లి ముద్దుబిడ్డలు.
ఈ జిల్లాలో పుట్టినోళ్లు మొనగాళ్లు. మహిళలు వీర వనితలు సమ్మక్క సారక్కలు. ఇక్కడి రక్తంలోని కణం కణం రణన్నినాద ం చేస్తది. ఈ గడ్డ మీద డైలాగ్ లు ఉండయి. ఓన్లీ యాక్షన్. మంచోడైతే మనసుకు హత్తుకుంటరు. చెడ్డోడైతే వాని చెమడాలు చీస్తరు. హ్యాట్సాఫ్ టు వరంగల్ బ్లడ్. ఇక్కడి ప్రజలు చూపిస్తున్న పోరాటపటిమకు పోరుతెలంగాణ పాదాభివందనం చేస్తుంది. జై తెలంగాణ. జై జై తెలంగాణ. జయహో ఓరుగల్లు.
No comments:
Post a Comment