ఇప్పుడు స్పష్టత వచ్చింది
ఎవరి వారు ఎవరో
ఇన్నాళ్లూ దొంగచాటుగా ఉన్నారు
నేడు
వారి స్వబుల్లి తెరలపై నృత్యం చేస్తున్నారు
అడుగడుగునా పోలీస్ పహారాను ప్రశ్నించనివాడు
గురివిందల అరవిందలై
ఇంకెంతకాలం వలెవేస్తారు
శ్రీరంగపు నీతులు
ఇన్నాళ్లూ మనందరి వారన్నారు
నేడు మావారంటున్నారు
నీ పాట, నాపాట
నీ బాష, నా యాస
నీ పద్యం, నా గద్యం
మొత్తంగా నీ, నా స్మృతులు వేరైనప్పుడు
నా వైతాళికులకు లేనిచోటు
నీ వారికే ఉంటే
నా హృదయం ద్రవించదా?
ఇక....
నీ నాటకం బయటపడింది
అరవై వసంతాల ఆక్రోషం
ఆరువందల ఆత్మబలిదానాలకు
వేదనతో గాయపడ్డ మా మనుసులకు
గైవించని చోట
మమ్ములను విధ్వంసం చేసిన చోట
నిన్నెలా భుజాన ఎత్తుకోను?
కూల్చిన రాతి బొమ్మలకే
ఎందుకంత రాద్ధాంతం
మా పిల్లల భవిష్యత్తును నేలరాల్చిన
మీ పరాయి పాలనపై
పెదవి విప్పరేమి
ఇప్పుడే నిజాలు బయటపడ్డాయి
మాకూ
స్పష్టత వచ్చింది
ఎవరివారు ఎవరో
ఇక ధూం ధామే....
amrunaik
No comments:
Post a Comment